రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు..
ఖానాపూర్: పట్టణంలోని కుమురం భీం చౌరస్తా స మీపంలోని నిర్మల్–ఖానా పూర్ ప్రధానరోడ్డు మార్గంలోని యానిమల్ ఫ్‌లై ఓవర్‌పై గురువారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సత్తన్‌పల్లికి చెందిన మాలవత్ రాజ్‌కుమార్(38) బైక్‌పై సింగాపూర్ నుంచి వస్తున్నాడు. నిర్మల్‌లో ఉంటున్న ఆఖిరెడ్డి రాజన్న(50) భార్య విజయ.. స్వగ్రామమైన కడెం మండలం అంబరిపేట్‌లో ఓటేశారు. తర్వాత నిర్మల్ వైపు బైక్‌పై వెళ్తుండగా ఢీకొన్నాయి. దీంతో రాజన్న అక్కడిక్కడే మృతి చెందగా, భార్య విజయ..గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కొన ఊపిరితో ఉన్న మాలవత్ రాజ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజ్‌కుమార్‌కు భార్య శ్వేత, ము గ్గురు కుమారులు ఉన్నారు. పోలీసులు ఘటన స్థ లానికి చేరుకుని ఘటన వివరాలు సేకరిస్తున్నారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబీకులను పరామర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.
అండర్ ట్రయల్ ఖైదీ..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బషీర్ సురేఖ(53) మృతిచెందినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బుధవారం జైలులో రక్తంతో వాంతులు చేసుకోవడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌కు చెందిన ఈమె అమ్మాయిల అక్రమ తరలింపు కేసులో నిందితురాలిగా ఉందని, గత నాలుగు నెలల నుంచి జిల్లా జైలులో శిక్షణ అనుభవిస్తుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు..


