సర్పంచ్ బరిలో కోడలు.. ఓటేయడానికి అమెరికా నుంచి మామ
లోకేశ్వరం: మండలంలోని బాగా పూర్ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అ యింది. రెండో విడతలో భాగంగా 14 న సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుంది. తన కోడలు ముత్యాల శ్రీవేద సర్పంచ్ బరిలో ఉండగా, ఓటేసి గెలిపించేందుకు అమెరికా నుంచి మామ ముత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామా నికి వచ్చారు. ఈయన అక్టోబర్ 9న అమెరికా లోని డల్లాస్‌లో ఉండే కూతురు ప్రళయ వద్దకు వెళ్లారు. నాలుగు నెలల గడువు ఉన్నా కోడలికి ఓటు వేయడానికి బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. కాగా, సర్పంచ్ బరిలో మరో అభ్యర్థి హర్ష స్వాతి పోటీపడుతున్నారు.


