ఎన్నికల ఉల్లంఘనపై 11 కేసులు నమోదు
● ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్
ఉట్నూర్‌రూరల్: జిల్లాలోని తొలి విడతలో భాగంగా ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధి లోని పంచాయతీ ఎన్ని కల నిబంధనల ఉల్లంఘనపై 11 కేసులు నమోదైనట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ తెలిపారు. ఉట్నూర్ సబ్ డివిజన్ పరిఽధిలోని ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, మద్యం పంపిణీ, రాత్రి వేళ ప్రచారం, అనుమతి లేని విజయోత్సవ ర్యాలీపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


