ఓడీ ఇవ్వాలని వినతి
శ్రీరాంపూర్: ఎన్నికల విధులకు వెళ్లే సింగరేణి ఉద్యోగులకు ఓడీ మస్టర్ ఇవ్వాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కోరారు. గురువారం ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి బాజీసైదా ఆధ్వర్యంలో నాయకులు శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారికి కంపెనీ స్పెషల్ లీవ్ ఇస్తుందన్నారు. ఇది ఫిజికల్ అటెండెన్స్‌గా పరిగణించడం లేదని, ఆదివారం డ్యూటీ చేస్తే అలవెన్స్ రాదని, సంవత్సర మస్టర్ల లెక్కల్లోకి రావడం లేదన్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. స్పెషల్ లీవ్ బదులు ఓడీ మస్టర్ ఇవ్వాలని కోరారు. యూనియన్ నాయకులు బద్రి బుచ్చ య్య, సందీప్, రాజు, రాజశేఖర్ పాల్గొన్నారు.


