మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
హాజీపూర్ మండలంలో అత్యధికంగా 16,954మందికి గాను 14,420 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.05శాతం పోలింగ్ నమోదైంది.
లక్సెట్టిపేటలో 25,227 మంది ఓటర్లకు గాను 20,771 మంది ఓటు వేయగా.. 82.34 శాతం పోలింగ్ నమోదైంది.
దండేపల్లిలో 34,213 మంది ఓటర్లకు గాను 27,362 ఓట్లు పోల్ కాగా 79.98శాతం పోలింగ్ శాతం నమోదు జరిగింది.
జన్నారంలో 43,306 మంది ఓటర్లకు 33,257 ఓటు వేయగా.. 76.80 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలు
మండలాల్లో భారీగా పోలింగ్ నమోదు
నాలుగు మండలాల్లో 80.04శాతం పోలింగ్
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్, పరిశీలకులు
జన్నారం 43,306 15,245 18,012 33,257 76.80
మొత్తం 1,19,700 45,257 50,552 95,810 80.04
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాతావరణం చల్లగా ఉండడంతో ఉదయం నుంచి మందకొడిగా మొదలైన పోలింగ్ ఎనిమిది గంటల నుంచి వేగం పుంజుకుంది. ఆ తర్వాత ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు భారీగా తరలివచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకుడు మనోహర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు..
ఆయా మండలాల్లోని 90 గ్రామ పంచాయతీల్లో ఆరు ఏకగ్రీవం కాగా.. మరో మూడు పంచాయతీలు గూడెం, నెల్కి వెంకటాపూర్, వందూర్‌గూడలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో మిగతా 81 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 258మంది పోటీపడ్డారు. 816వార్డు సభ్యుల స్థానాలకు 34చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 268మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. 514 స్థానాల్లో 1476మంది బరిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగగా.. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. తక్కువగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో ఫలితాలు త్వరగా వెలువడ్డాయి. ఓటర్లు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రాత్రి వరకు లెక్కింపు కొనసాగి ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి.
పరిశీలించిన అధికారులు
పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. హాజీపూర్ మండలం దొనబండ, హాజీపూర్, పెద్దంపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలతోపాటు లక్సెట్టిపేట, దండేపల్లి జన్నారం మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు మనోహర్, కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీఓ వెంకటేశ్వర్‌రావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని తెలుసుకుని ప్ర శాంతంగా ఎన్నికలు ముగించాలని సూచించారు.
నాగరం తొలి ఫలితం..
హాజీపూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీ ఫలితం మొదట వెలువడింది. ఇక్కడ 228 మంది ఓటర్లకు గాను 207ఓట్లు పోలయ్యాయి. బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కొడప కళావతిపై కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పెంద్రెం మహేశ్వరి 20ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మండలం 7–9గం 9–11గం 11 –ఒంటిగంట వరకు
పోలైనవి శాతం పోలైనవి శాతం పోలైనవి శాతం
దండేపల్లి 5,548 16 17,845 52 28,520 74.59
హాజీపూర్ 3,176 19 9,167 54 14,371 84.76
జన్నారం 6,058 14 19,568 45 32,584 75.24
లక్సెట్టిపేట 5,794 23 14,026 56 20,440 81.02
మొత్తం 20,576 17 60,606 51 92,915 77.62
పోలింగ్ సరళి ఇలా..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల్లో హాజీపూర్ మండలంలో అత్యధికంగా పోలింగ్ 85శాతం నమోదు కాగా, జన్నారంలో 75శాత నమోదైంది. ఉదయం మందకొడిగా మొదలై ఆ తర్వాత పుంజుకుంది. పురుషులకంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హాజీపూర్‌లో అత్యధికంగా పోలింగ్
నాలుగు మండలాల్లో మొత్తంగా 1,19,700 మంది ఓటర్లకు గాను 95,810 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.04శాతం పోలింగ్ నమోదైంది.
పంచాయతీ ఎన్నికల్లో మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశారు. హాజీపూర్ మండలంలో 306 మంది మహిళలు, లక్సెట్టిపేటలో 847, దండేపల్లిలో 1,375, జన్నారంలో 2,767 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటు వేశారు. మొత్తంగా పురుషులకన్నా 5,295 మంది మహిళలు ఎక్కువ ఓటు వేశారు. మొత్తం ఓటరల్లో కూడా పురుషుల కన్నా మహిళలు 3,135 మంది ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్లలోనూ ఎక్కువగా ఉన్న మహిళలు పో లింగ్‌లోనూ ఎక్కువ సంఖ్యలోనే పాల్గొన్నారు. ఫలితాల్లో కీలకంగా వ్యవహరించారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
మంచిర్యాలఅగ్రికల్చర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటి విడత పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమస్యాత్మకగా పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌటింగ్ ప్రక్రియను అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. జిల్లాలో గుర్తించిన 24 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. హాజీపూర్, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాల్లో త్వరలోనే సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పోలింగ్ సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు.
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓ


