ఆ కుటుంబానికే హ్యాట్రిక్
జన్నారం: మండలంలోని కామన్‌పల్లి గ్రామ సర్పంచ్ స్థానాన్ని మూడోసారీ పేరం శ్రీనివాస్ కుటుంబం గెలుచుకుని హ్యాట్రిక్ సాధించింది. మొదటిసారి శ్రీనివాస్ తల్లి పేరం బుచ్చవ్వ, రెండోసారి ఆయన భార్య మానస గెలుపొందారు. మూడోసారి శ్రీనివాస్ బరిలో నిలిచి విజయం సాధించాడు. బీఆర్‌ఎస్ బలపర్చిన శ్రీనివాస్ గురువారం వెలువడిన ఫలితాల్లో ప్రత్యర్థి రాజన్నపై వంద ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
రెండు ఓట్లతో అదృష్టం
లక్సెట్టిపేట: మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామ సర్పంచ్‌గా దుమ్మని సత్తన్న రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మొత్తం 1240 ఓట్లకు గాను 1016 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సత్తన్నకు 478 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీఆర్‌ఎస్ మద్దతుదారు గంగయ్యకు 476 ఓట్లు వచ్చాయి.
6 ఓట్ల తేడాతో విజయం
దండేపల్లి: మండలంలోని కర్ణపేట గ్రామ పంచాయతీకి గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠత నెలకొంది. స్వంతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అజ్మేరా సుభాష్ తన సమీప ప్రత్యర్థి సోయం జంగుపై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
11 ఓట్లతో సర్పంచ్ గెలుపు
జన్నారం: మండలంలోని బంగారుతండా గ్రామ పంచాయతీ నుంచి 11 ఓట్ల తేడాతోనే సర్పంచ్ అభ్యర్థి బుక్య నిర్మలబాయి గెలుపొందారు. గ్రామ పంచాయతీలో మొత్తం 390 ఓట్లు ఉండగా 206 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి సాయికుమార్‌పై 11 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
15 ఓట్ల మెజారిటీ
జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో హోరాహోరీ సాగిన పోరులో 15 ఓట్లతో చివరికి బొంతల నాగమణి గెలుపొందారు. గ్రామంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగగా.. మండలంలో ఆసక్తికరంగా మారింది. ఒకటి, ఐదు ఓట్ల తేడాతోనే అధిక్యత కనబరుస్తూ ఉన్న నాగమణి ప్రత్యర్థి అభ్యర్థి స్వరూపరాణిపై చివరికి 15 ఓట్లు మెజారిటీతో గెలుపొందడం గమనార్హం.
ఆ కుటుంబానికే హ్యాట్రిక్
ఆ కుటుంబానికే హ్యాట్రిక్


