డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ల నియామకం
మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్లను ఉన్నత న్యాయస్థానం బుధవారం నియమించిన ట్లు స్థానిక జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సత్య శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా ఆదిలాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సేహీనీ సుల్తానా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా మంచిర్యాల అసిస్టెంట్ సెషన్స్ కో ర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్‌ను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు.


