అనధికార పొత్తులు! | - | Sakshi
Sakshi News home page

అనధికార పొత్తులు!

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

అనధికార పొత్తులు!

అనధికార పొత్తులు!

● జెండాల్లేవ్‌.. ఎజెండానే ముఖ్యం ● కొన్నిచోట్ల ‘కలిసే’పోతున్న పార్టీలు ● పదవులు పంచుకుని ప్రచారంలోకి.. ● ‘పంచాయతీ’ ఎన్నికల్లో గమ్మత్తు ● భీమిని మండలం లక్ష్మీపూర్‌, కేస్లాపూర్‌ పంచా యతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మద్దతు దారులంతా కలిసే పోటీ చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను ఓడించేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒక్కటై ముందుకు సాగుతున్నారు. ● తాండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య సఖ్యత కోసం పావులు కదుపుతున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ బలంగా ఉండడంతో ఓడించేందుకు హస్తం, కమలం పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ● బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తుతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ● దండేపల్లి మండలం పాత మామిడిపల్లి పంచా యతీ పరిధిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవుల కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఓ పొత్తు కుదిరి, ఏకగ్రీవానికి దారి తీసినట్లు గ్రామంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ● దండేపల్లి మండలంలోని ఓ గ్రామ పరిధిలో పోటీ చేసిన వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులంతా కలిసి లాటరీ తీశారు. లాటరీలో పేరు వచ్చిన వ్యక్తి బరిలో నిలిచి మిగతా వారిని ఉపసంహరించుకునేలా చూసి ఏకగ్రీవమయ్యేలా చేశారు. ● జైపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి రూ.లక్షలు ఇచ్చేందు కు ముందుకు వచ్చాడు. ఇందులో బీఆర్‌ఎస్‌ బ లపరిచిన అభ్యర్థి కూడా ఉండడం గమనార్హం. ఇవే కాకుండా చాలా గ్రామాల్లో లోలోపల మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల్లో పదవుల కోసం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ కార్యకర్తలను నాయకులు పక్కన పెడుతున్నారు. ఇ న్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరుధ్యాలను మరిచి ప్ర జాప్రతినిధులుగా గెలిచేందుకు సిద్ధపడుతున్నారు. కొన్నిచోట్ల నువ్వా.. నేనా? అన్నట్లుగా కొట్లాడుతుండగా, మరికొన్ని చోట్ల మధ్యే మార్గంగా రాజీ పడు తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలు బ లపరిచిన అభ్యర్థులు జెండాలను పక్కకు పెట్టి త మ ఎజెండాను అమలు చేస్తున్నారు. పార్టీ అధిష్టా నం నుంచి ఒప్పుకోకున్నా, అనధికార పొత్తులతో ఎత్తులు వేస్తున్నారు. మండల, జిల్లా పరిషత్‌, ము న్సిపల్‌ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహిస్తారు. ఇందుకు పార్టీ నుంచి ‘బీ ఫాం’ తప్పనిస రి. అయితే పంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నం. రాజకీయ పార్టీల గుర్తులుండవు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ సూచించిన గుర్తులే కేటా యిస్తారు. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత పలుకుబడితో ప్రతిపక్ష నాయకులు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులు పంచుకుంటున్నారు. ఇ ప్పటివరకు జిల్లాలో ఆరుగురు సర్పంచులు, 268 మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాల వెనుక భారీ తతంగం జరుగుతోంది.

జెండాలు లేవు.. ఎజెండాలే

జిల్లాలో తొలి విడత ఎన్నికల్లో ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాల కోసం ఆయా పార్టీల నాయకులు కలిసి పదవులు పంచుకున్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు నడస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ కోసం పలు విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతిపక్షాలకు దెబ్బ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి కొంత కలిసి వస్తుండగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు వస్తున్నాయి. సర్పంచ్‌ పదవులు అధికంగా అధికార పార్టీకి దక్కుతుండగా ప్రతిపక్ష పార్టీలు రాజీ పడాల్సి వస్తోంది. పంచాయతీల్లో అధికంగా పలుకుడి ఉన్న నాయకులు ఆయా చోట్ల పోటీ లేకుండా ఉండేందుకు పార్టీలను పక్కకు పెట్టి ముందుకు సాగుతున్నారు. మరోవైపు సర్పంచులుగా గెలిచాక ఆయా అభ్యర్థులకు పార్టీ జెండా కప్పి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement