పెద్దపులి సంచారం
బెజ్జూర్: మండల పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఇటీవల కృష్ణపల్లి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించడంతో అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తత చర్యల్లో భాగంగా కృష్ణపల్లి గ్రామంలో సోమవారం డప్పు చాటింపు ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. పులి సంచారం ఉన్న నేపథ్యంలో అడవిలోకి ఒంటరిగా వెళకూడదని సూచించారు. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించి పులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గ్రామాల్లో పోలీసులు, అటవీ సిబ్బంది సంయుక్తంగా పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


