బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఈ రాజన్న
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్(ఎస్‌ఈ) రాజన్న మంగళవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి డీఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్‌ఈగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఈ ఉత్తమ్ జాడేను ఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతానికి పోస్టింగ్ వెయిటింగ్ లిస్టులో ఉంచారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఈని డీఈ, ఏడీఈలు, ఏఈలు, సబ్‌ఇంజనీర్లు శాలువాతో సత్కరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్‌ఈ రాజన్న కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఏడీఈ మోహన్‌రెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.


