ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీ
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు, హోమియో క్లినిక్‌లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఇటీవల మంచిర్యాలలోని రాఘవేంద్ర, శ్రీమాత పిల్లల ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చిన్నారులు చనిపోయారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు టీజీఎంసీ సభ్యుడు యెగ్గన శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమి యో క్లినిక్‌లు సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సుమైరాస్ హోమియో, ఈస్తటిక్ క్లినిక్(సౌందర్య) సే వలు, నిర్వహణ పద్ధతులపై వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నివేదికను తెలంగాణ మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్‌వోకు సమర్పించినట్లు పేర్కొన్నారు.


