చెన్నూర్/బెల్లంపల్లి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన దుర్గం అశోక్, బెల్లంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవిని నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో ఇద్దరికి చోటు లభించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, చెన్నూర్, బెల్లంపల్లి పట్టణ, మండల కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
దుర్గం అశోక్
మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి


