ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలి

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

దండేపల్లి: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని కొండాపూర్‌, ద్వారక, లక్ష్మీకాంతపూర్‌, పెద్దపేట గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఫసల్‌ బీమా అమలయితే ఇలాంటి విపత్తులతో పంట నష్టపోతే బీమా ప్రయోజనం కలుగుతుంద ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలో ఫసల్‌ బీమా అమలు కావడం లేదన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్‌, నాయకులు గోపతి రాజయ్య, సురేష్‌, కిషన్‌ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement