మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల బస్టాండ్‌లో ‘మహాలక్ష్మి’ విజయోత్సవ సభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించి 290 కోట్ల ఉచిత ప్రయాణాలతో రూ.10వేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల డిపోలో 3.15 కోట్ల మంది ఉచిత ప్రయాణం కింద మహిళల రూ.130 కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా అయినట్లు నగర మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ స్రవంతి, డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


