బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
నస్పూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర మంగళవారం నస్పూర్‌కు చేరింది. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని అన్నా రు. సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సిద్దం కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్‌దొర, రిషబ్, నర్సింహారావు, కళాబృందం రాష్ట్ర నాయకులు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


