పల్లె పోరుకు సై..
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఎమ్మెల్యే పీఎస్సార్‌ను కలిసిన డిప్యూటీ సీఎం ‘భట్టి’
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్)ను సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి విచ్చేసిన సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లె పోరుకు నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక శుక్రవారం(ఈ నెల 27) నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలు కానుంది. జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉండగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 17నాటితో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇక గత సెప్టెంబర్‌లోనే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లు, గుర్తులు, సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలు, రూట్‌మ్యాప్ తదితరవన్నీ పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరిగి తుది జాబితా సిద్ధమైంది.
ఆశావహుల సందడి
పోటీకి సిద్ధమై తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఆశావహుల సందడి నెలకొంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉంది. దీంతో ఆయా గ్రామాల్లో అభ్యర్థులు తమ ఏర్పాట్లు ముమ్మరం చేసుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీల్లోని నాయకులు తమ పార్టీ నుంచి మద్దతు కోసం నియోజకవర్గ బాధ్యులను కలుస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎమ్మెల్యేలను రిజర్వేషన్లు అనుకూలించిన వారంతా వారంతా కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించడంతో తమకు అనుకూల పవనాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. ఇటీవల డీసీసీ అధ్యక్షులను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను వేగం చేసింది. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో సమరోత్సాహంతో ఉన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, సర్కారుపై ఉన్న వ్యతిరేకతతో గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌లో మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీలో నియోజకవర్గ బాధ్యులు, వామపక్ష పార్టీల్లో ఆయా నాయకులు తమ పట్టు పెంచుకునేందుకు కేడర్‌ను సన్నద్ధం చేసి గెలుపు గుర్రాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే పని మొదలు పెట్టారు.
మండలాలు 16
గ్రామ పంచాయతీలు 306
పోలింగ్ కేంద్రాలు 714
వార్డులు 2,680
బ్యాలెట్ బాక్సులు 3,632
ఎన్నికల సిబ్బంది 5,194
నవంబర్ 30న డిసెంబర్ 3 డిసెంబర్ 6
డిసెంబర్ 3 డిసెంబర్ 6 డిసెంబర్ 9
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11, రెండవ విడత 14, మూడవ విడత 17న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఉపసర్పంచ్‌నూ ఎన్నుకుంటారు.
ఐసీడీఎస్ నిర్వీర్యానికి కుట్ర
ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఐటీయూ నాయకురాలు సింధు ఆరోపించారు. ఆదిలాబాద్‌లో ఐదో రాష్ట్ర మహాసభలు నిర్వహించారు.
విడతల వారీగా ఎన్నికలు...
మొదటి విడత రెండో విడత మూడో విడత
ఓటరు జాబితా ప్రదర్శన నవంబర్ 17 నవంబర్ 30 డిసెంబర్ 3
నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27, 28, 29 నవంబర్ 30, డిసెంబర్ 3, 4, 5 డిసెంబర్ 1, 2
నామినేషన్ల పరిశీలన,
అభ్యర్థుల జాబితా
అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 1 డిసెంబర్ 4 డిసెంబర్ 7
అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 2 డిసెంబర్ 5 డిసెంబర్ 8
నామినేషన్ల ఉపసంహరణ,
తుది జాబితా ప్రకటన
పోలింగ్ డిసెంబర్ 11 డిసెంబర్ 14 17
పల్లె పోరుకు సై..
పల్లె పోరుకు సై..


