ప్రజాకళలతో సమాజాన్ని తట్టి లేపాలి
బెల్లంపల్లి: ప్రజాకళలతో నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని తట్టిలేపి జన చైతన్యానికి తోడ్పడాలని ప్రజా నాట్యమండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్ సూచించారు. ఆదివారం బెల్లంపల్లి సీఐటీ యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజానాట్య మండలి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని ఆ రోపించారు. పెట్టుబడిదారి, కార్పొరేట్ శక్తులకు దే శ సంపదను దోచిపెడుతూ ప్రజలను కష్టాల్లోకి నె డుతున్నాయని విమర్శించారు. ప్రజలను వంచిస్తు న్న ప్రభుత్వాల కుటిల నీతిని కళారూపాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. సీపీఎం రా ష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. బీ జేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల కు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమాజ హితం కో రి ప్రజానాట్యమండలి కళాకారులు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి కళారూపాలను సాధనాలు గా వినియోగించుకోవాలని సూచించారు. సీపీఎం, సీఐటీయూ, ప్రజానాట్య మండలి నాయకులు రమణ, రంజిత్‌కుమార్, అశోక్, దేవదాస్, సుధాకర్, తి రుపతి, కిషన్, రాజేశం, బాపు, ఉమారాణి, సరిత, జిలానీ, ప్రసాద్, మనోహర్ తదితరులున్నారు.


