
అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–14, 17 బాలబాలికల అథ్లెటిక్ ఎంపిక పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాసిపేట జెడ్పీహెచ్‌ఎస్ సహకారంతో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 600మందికి పైగా క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశ్వరస్వామి, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ యా కూబ్, పాఠశాల హెచ్‌ఎం సాంబమూర్తి, పర్యవేక్షకులు రేణి రాజయ్య, భూక్యా రాజన్న, పీడీ మార య్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు వాలీబాల్ ఎంపిక పోటీలు
ఈనెల 11న పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో లక్సెట్టిపేట జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు) పాఠశాలలో అండర్–17, 14 బాలికల జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యాకూబ్ ఓ ప్రకటనలో తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.