తుపాకి దించి.. అజ్ఞాతం వీడి.. | - | Sakshi
Sakshi News home page

తుపాకి దించి.. అజ్ఞాతం వీడి..

Oct 16 2025 6:28 AM | Updated on Oct 16 2025 6:28 AM

తుపాకి దించి.. అజ్ఞాతం వీడి..

తుపాకి దించి.. అజ్ఞాతం వీడి..

జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు ఉమ్మడి జిల్లాకు చెందిన సరోజ, మోహన్‌రెడ్డి లొంగుబాటు నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ ప్రస్థానం ‘మల్లోజుల’ వెంట అజ్ఞాతవాసానికి తెర

బెల్లంపల్లి/నిర్మల్‌: నమ్మిన సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఉద్యమం ప్రస్థానం కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ వల్ల ఉద్యమం పలుచనబడి అనేకమంది అమరులు అవుతున్నారని, ఈ క్రమంలో సాయుధ పోరాటం అసాధ్యమని ప్రకటించిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అభిప్రాయంతో ఏకీభవించి తుపాకి దించి వనం వీడారు. బుధవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట ‘మల్లోజుల’ నేతృత్వంలో లొంగిపోయిన 60మందిలో ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన దంపతులు సలాకుల సరోజ, ఇర్రి మోహన్‌రెడ్డి ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సరోజ ఉరఫ్‌ లత ఉరఫ్‌ దీప ఉరఫ్‌ స్వాతి మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ(డీకేఎస్‌జెడ్‌సీ) సెక్రెటరీగా, ఆమె భర్త నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి ఉరఫ్‌ వివేక్‌ మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిపై చేరో రూ.50లక్షల వరకు రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.

పెళ్లి ఇష్టంలేక ఉద్యమానికి ఆకర్శితురాలై..

బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన సలాకుల రాజమ్మ, సాయిలు దంపతులకు కుమారులు రాజనర్సు, మ ల్లయ్య, రామస్వామి, కూతుళ్లు లక్ష్మీ, ఎల్లక్క, సరో జ సంతానం. సింగరేణి కార్మికుడైన సాయిలు సరో జకు 15ఏళ్ల వయస్సులో బాల్యవివాహం చేశాడు. అప్పటికి ఆమె స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలానికి చెందిన దగ్గరి బంధువుకు ఇచ్చి పెళ్లి చేయగా భర్త వేధింపులతో పుట్టింటిలో ఉండి అతడికి దూరమైంది.

ఉద్యమ ప్రభావంతో..

పీపుల్స్‌వార్‌ పార్టీ ఉద్య మం కన్నాలబస్తీలో తీవ్రస్థాయిలో ఉండేది. 1984 లో పీపుల్స్‌వార్‌ పార్టీ వా రం రోజులపాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విప్లవ ఓనమాలు నేర్చుకుంది. ఇష్టంలేని పెళ్లి, భర్త వేధింపులు తదితర అంశాలతో తీవ్రంగా కలతచెంది పోరుమార్గాన్ని ఎంచుకుని రహస్య జీవితంలోకి వెళ్లిపోయింది.

దండకారణ్యంలోనే..

సరోజ ఉద్యమ ప్రస్థానమంతా దండకారణ్యం కేంద్రంగా సాగింది. కేవలం ఏడాదిపాటు కొత్తగూడెం నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు కొరియర్‌గా పని చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన హింసాత్మక కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో పోలీసు రికార్డుల్లో ఆమె పేరు వినిపించలేదు. పార్టీ ఆదేశాల మేరకు దండకారణ్యంలోకి వెళ్లి నాలుగు దశాబ్దాలపాటు ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా ఆదివాసీలతో కలిసి గడిపింది. కొన్నాళ్లపాటు పార్టీ ప్రింటింగ్‌ ప్రెస్‌ బాధ్యతలు, ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహించింది.

దీప పేరుతో వ్యాసం..

అమరుడు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు కటకం సుదర్శన్‌ ఉరఫ్‌ దూలాదాదా, సరోజ ఇద్దరు కూడా కన్నాలబస్తీ వాస్తవ్యులు. దండకారణ్యంలో ఉద్యమ కార్యకలాపాల్లో భాగంగా పలుమార్లు సుదర్శన్‌తో మాట్లాడే అవకాశం ఆమెకు దక్కింది. సుదర్శన్‌ అనారోగ్యం మరణించిన సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ‘అరుణ తా ర’ పత్రికలో దీప పేరుతో సరోజ ప్రత్యేకంగా వ్యా సం రాసి విప్లవ స్మృతులను నెమరు వేసుకుంది.

రూర్కేలాలో అరెస్టు

ఉద్యమ విస్తరణలో భాగంగా జార్ఖండ్‌ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తూ సరోజ, మోహన్‌రెడ్డి సహచరులతో ఓసారి రూర్కేలా పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించగా.. నేరం రుజువు కాకపోవడంతో కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో 2009లో జైలు నుంచి విడుదలైన ఇద్దరూ నక్సలైట్‌ అగ్రనాయకులు మూల దేవేందర్‌రెడ్డి, మాధవ్‌, అమరుడు జాడి వెంకటితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement