
సంపత్‌కు సాహితీ పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: ప్రతిష్టాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2023, జిల్లాకు చెందిన సాహితీవేత్త డాక్టర్ టి.సంపత్ కుమార్‌ను వరించింది. పలు సాహితీ విభాగాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథాలను ఎంపిక చేయగా ఉత్తమ కథా సంపుటిగా ఈయన రాసిన ‘నా నుంచి మన వరకు’ ఉంది. ఇదే రచనకు 2023, మేలో తెలంగాణ సరస్వత పరిషత్ రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందించింది. ఈ నెల 29న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో రూ.20,116 నగదు పురస్కారంతో సంపత్‌కుమార్‌ను సత్కరించనున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ టి.సంపత్ కుమార్ కెనడా హై కమిషన్ కార్యాలయంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఢిల్లీలో పదవీ విరమణ పొందిన అనంతరం ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. తెలుగుతోపాటు ఆంగ్ల భాషల్లోనూ అనేక కథలు, నవలలు రచించారు.