
వేర్వేరు చోట్ల ఇద్దరికి పాము కాటు
బేల: మండలంలోని సిర్సన్న, జూనోని రెవెన్యూ గ్రామ శివారుల్లోని పొలాల్లో గురువారం ఇద్దరు రైతులు పాముకాటుకు గురయ్యారు. సిర్సన్న గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న బబన్‌కు, జూనోని గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న వైశాలిని వేర్వేరుగా పాములు కాటేశాయి. గమినించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ అనిల్, పైలెట్ అర్షద్‌ఖాన్ బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.
వైశాలికి చికిత్స చేస్తున్న ఈఎంటీ అనిల్