
విద్యుత్ షాక్‌తో గుర్తు తెలియని వ్యక్తి..
నేరడిగొండ: మండలంలోని బుద్దికొండ గ్రామ స మీపంలో స్థానిక రైతు నవీన్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (45) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తెల్ల టి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరి ంచి ఉన్నట్లు తెలిపాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వివరాలు తెలిసిన వారు 8712659947 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.