
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఐటీడీఏ ఏవో దామోదర్ స్వామి అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్ర జల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం శాంతినగర్‌కు చెందిన గోడం విజయ ఆశ్రమ పాఠశాలలో వర్కర్‌గా నియమించాలని, మామడ మండలం రామదారితండాకు చెందిన గుగ్లావత్ అ మృత ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని, తలమడుగు మండలం అర్లి (కే)కు చెందిన నారు బు మ్మన్న బోర్‌వెల్ మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌కు చెందిన లలిత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, తదితర సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.