
బస్సు మరమ్మతులకు గురైతే..
మొబైల్ ఫోన్ డిపాజిట్ చేయడం ఇబ్బంది కాకపోయినా అత్యవసర సమయంలో మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సంబంధిత అధికారుల మొబైల్ నంబర్లన్నీ ఫోన్లోనే ఉంటాయి. బస్సు మరమ్మతులకు గురైతే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారు. అటవీ ప్రాంతాల్లో బస్సు నడిచినప్పుడు కండక్టర్ నంబర్ సైతం పనిచేయకపోతే అవస్థలు వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలి.
– స్వామి దాస్, డ్రైవర్, ఉట్నూర్ డిపో
పైలట్ ప్రాజెక్టుగా ఉట్నూర్
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఉట్నూర్ డిపోను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. విధుల్లోకి వచ్చే ముందు డిపో సెక్యూరిటీ కార్యాలయంలో ఆర్టీసీ డ్రైవర్లతోపాటు, ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లు కూడా మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి ఫలితాలను ఆధారంగా చేసుకుని సంస్థ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
– ప్రతిమారెడ్డి, ఉట్నూర్ డిపో మేనేజర్

బస్సు మరమ్మతులకు గురైతే..