
● స్పందిస్తూ.. ప్రాణాలు నిలుపుతున్న 108 సిబ్బంది ● రాష
జిల్లాలోని మొత్తం 108 వాహనాలు 17
నవజాత శిశు వాహనం 1
వాహనాల్లో పనిచేసే ఈఎంటీలు 35
వాహనాల్లో పనిచేసే పైలట్‌లు 38
గడిచిన నాలుగు నెలల్లో
తరలించిన అత్యవసర కేసులు
ఏప్రిల్ 2,450
మే 2,620
జూన్ 2,870
జూలై 27 వరకు 2,145
సకాలంలో వైద్యం..
మంచిర్యాల జిల్లాలో 108 వాహనాలు సి బ్బంది మూడు నెలలుగా బాధితులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు. మెరుగైన సేవలతో జిల్లా రా ష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. జిల్లాలో పనిచేస్తున్న ఈఎంటీలకు రాష్ట్రస్థాయి ఉత్తమ స్టార్ అవార్డు అందుకున్నారు.
– బి.సామ్రాట్, 108 వాహనాల ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్
మంచిర్యాలటౌన్: అత్యవసర వైద్యం అవసరమైనవారిని వెంటే సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లు, అందులో పనిచేస్తున్న సిబ్బంది ఇప్పుడు ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులుగా మారారు. ప్రమాదాలు జరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా, నిమిషాల వ్యవధిలోనే స్పందించి, బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అవసరమైన వైద్యం అందిస్తున్నారు. అత్యవసర సేవల్లో గడిచిన మూడు నెలల్లో జిల్లా సిబ్బంది రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు. సేవలు అందిస్తున్న ఈఎంటీలు (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్), పైలట్‌లు అవార్డులు అందుకుంటున్నారు.
అత్యాధునిక సేవలు
జిల్లాలో 17 అంబులెన్సులు, ఒక నవజాత శిశు వాహనంఉంది. వీటిలో 35 మంది ఈఎంటీలు, 38 మంది పైలట్‌లు పనిచేస్తున్నారు. అత్యాధునిక వైద్య పరికరాలతో అమర్చిన ఈ వాహనాలు, అత్యవసర సమయాల్లో ప్రసవాలు చేయడం, ప్రథమ చికిత్స అందించడం వంటి కీలక సేవలతో బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ సమర్థవంతమైన సేవల కారణంగానే మంచిర్యాల జిల్లా 108 రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం నిలబెట్టుకుంటోంది.
నిరంతర సేవలతో అగ్రస్థానం
జిల్లా 108 సిబ్బంది, పండుగలు, సెలవు రోజులతో సంబంధం లేకుండా, ప్రమాద స్థలాలకు నిమిషా ల్లో చేరుకుని, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రతీనెల 2 వేలకుపైగా కేసులను నిర్వహిస్తున్నారు. గర్భిణులు, క్షతగాత్రుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 27 వరకు, 20 సుఖప్రసవాలు జరిగేలా చేయడంలో కీలకపాత్ర పోషించా రు. కొన్ని ప్రసవాలు వాహనాల్లోనే జరిగాయి.
ఆన్‌లైన్ అనుసంధానంతో..
రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్ వాహనాలు ఆన్‌లైన్‌కు అనుసంధానించారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా బాధితుల వద్దకు తక్షణం చేరుకుంటున్నాయి. సమాచారం అందిన వెంటనే, సమయం వృథా కాకుండా, బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించడంలో ఈ సాంకేతికత కీలకంగా మారింది. ఈ వేగవంతమైన, సమర్థవంతమైన సేవలే మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపాయి.

● స్పందిస్తూ.. ప్రాణాలు నిలుపుతున్న 108 సిబ్బంది ● రాష

● స్పందిస్తూ.. ప్రాణాలు నిలుపుతున్న 108 సిబ్బంది ● రాష