
కుళ్లిన చికెన్, పాడైన గుడ్లు
బోథ్: సొనాల మండలంలోని ఓ పెట్రోల్ పంపు సమీపంలో గల దాబాలో కుళ్లిన చికెన్, పాడైన గుడ్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు దాబాలో తింటున్న ఓ యువకుడి అన్నంలో బొద్దింక వచ్చింది. బోథ్ మండలంలోని కౌఠ(బి) గ్రామానికి చెందిన యువకుడు శనివారం సొనాల మండలం గుట్టపక్కతండా సమీపంలో ఓ పెట్రోల్ పంపు వద్ద ఉన్న దాబాకు వెళ్లాడు. భోజనం చేస్తుండగా అన్నంలో బొద్దింక ప్రత్యక్షంతో కంగుతిన్నాడు. వెంటనే దాబా సిబ్బందిని పిలిచి ఇదేంటని అడిగితే, అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువకుడు పలువురు స్థానికులు, విలేకరులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని తనిఖీ చేయగా బొద్దింక ఉన్న అన్నంతోపాటు, రిఫ్రిజిరేటర్‌లో కుళ్లిన చికెన్ మాంసంతోపాటు పాడైన ఉడకబెట్టిన గుడ్లు కనిపించాయి. అప్పటికే దాబాలో తింటున్న వారు అవాక్కయ్యారు. మధ్యలో భోజనం ఆపివేశారు. భోజనంలో బొద్దింక రావడంపై సదరు సిబ్బందిని అడుగగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని వారు తెలిపారు. అధికారులు వెంటనే దాబాను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
దాబాలో నాసిరకం ఆహార పదార్థాలు
తాజాగా అన్నంలో బొద్దింక ప్రత్యక్షం

కుళ్లిన చికెన్, పాడైన గుడ్లు