
ఎకరాకు రూ.30 లక్షలు ఇవ్వాలి
● ఆర్డీవో శ్రీనివాస్‌రావుకు ఓసీపీ నిర్వాసితుల వినతి
జైపూర్: ఇందారం ఓపెన్‌కాస్టు డంపింగ్ యా ర్డు కోసం సేకరించిన 129 ఎకరాల భూములకు మార్కెట్ రేటుకు అనుగుణంగా రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్డీవో శ్రీని వాస్ రావుకు రామారావుపేట, ఇందారం రైతులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఓపె న్‌కాస్టు డంపింగ్ యార్డు కోసం రామారావుపేట శివారులో 129 ఎకరాలు సేకరించారని, పరి హారం నిర్ణయించకుండా సింగరేణి యా జమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. రాజీ వ్ రహదారికి సమీపంగా ఉన్న విలువైన భూ ములు సింగరేణి యాజమాన్యం తీసుకుంటుంద ని, ప్రస్తుతం ఎకరాకు రూ.కోటి ఉందని పేర్కొన్నారు. యాజమాన్యం రైతులకు సరైన పరి హారం చెల్లించేలా చూడాలని కోరారు. లేదంటే తమ భూములు తమకు ఇవ్వాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నిర్వాసితులు జిట్ట దే వయ్య, నామాల తిరుపతి, యాదగిరి, సరిత, అక్షత్, సాగర్, సత్తయ్య, వేణుగోపాల్, వెంకటేశ్, జీవన్, మధుకర్ తదితరులు ఉన్నారు.