● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం.. ● కుప్పలు, కవర్లు మార్చడానికి అదనపు ఖర్చు.. | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం.. ● కుప్పలు, కవర్లు మార్చడానికి అదనపు ఖర్చు..

May 25 2025 12:07 AM | Updated on May 25 2025 12:07 AM

● జిల

● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్ర

మందమర్రి మండలం సారంగపల్లిలో బురదలో నుంచి ధాన్యం మరోచోటకు తరలిస్తున్న రైతులు

వానలే దెబ్బతీస్తన్నయ్‌..

ఎకరం పొలంలో ఏటా ట్రాక్టర్‌ లోడు వడ్లు వచ్చేది. ఈ యేడు రెండు ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చి పదిరోజులు దాటింది. మొన్ననే మాయిశ్చర్‌ వచ్చింది. తూకం వేయడానికి నా సీరియల్‌ నంబర్‌ వచ్చేసరికి వానలు మొదలైనయ్‌. మూడు రోజుల నుంచి వానలతో కవర్లు కప్పుడు, కాలువలు తీసుడే అయితాంది. అయినా వడ్లు తడుస్తున్నయ్‌. దీంతో నష్టం తప్పేలా లేదు..

– పొట్టాల రామయ్య, చిర్రకుంట

మంచిర్యాలఅగ్రికల్చర్‌: అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు జిల్లా వ్యాప్తంగా 23.7 మిల్లీమీటర్ల సగటు వ ర్షపాతం నమోదైంది. కాసిపేట, దండేపల్లి, హజీ పూర్‌, తాండూర్‌, మందమర్రి మండలాల్లో భారీ వ ర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి న ధాన్యం బస్తాలు, ఆరబోసిన ధాన్యం వర్షంలో తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తడం, బూజు పట్టడంతో నష్టం వా టిల్లుతోంది. తడిసిన ధాన్యం చూసి రైతులు కంట తడి పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నాలు గైదు కవర్లు, ఫెక్సీలు ధాన్యం కింద, మీద కప్పినా వరద ధాన్యం కుప్పలోకి చేరుతుంది. కాలువలు తీసి కాపాడుకునేందుకు ఆరిగోస పడుతున్నారు.

ధాన్యం తరలింపుతో ఆర్థిక భారం

వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలు బురదమయమవడంతో లారీలు లోపలికి వెళ్లలేక రోడ్లపై నిలిపివేస్తున్నారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రోడ్లపైకి తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ లోడింగ్‌కు కూలీలు, కిరాయితో కలిపి రూ.600 ఖర్చవుతోంది. టర్పాలిన్‌ కవర్ల కిరాయి మరో భారంగా మారుతోంది. ధాన్యాన్ని ఒకచోట నుంచి మరోచోటికి మార్చడం, కవర్లు కప్పడం వంటి పనులతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం సేకరణలో అడ్డంకులు

జిల్లాలో 1,50,738.880 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. దీంతో 75 శాతం సేకరణ పూర్తయింది. జన్నారం, దండేపల్లి, హజీపూర్‌ వంటి మండలాల్లో 90 శాతం సేకరణ పూర్తయింది. వేమనపల్లి, కోటపల్లి వంటి ప్రాంతాల్లో ఆలస్యంగా దిగుబడి వచ్చిన ధాన్యం వర్షాల కారణంగా తడుస్తోంది. 108 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు.

పరిష్కారానికి చర్యలు

గత నెలలో మిల్లుల వద్ద ధాన్యం తరలింపు ఆలస్యమైనప్పటికీ, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలకు కేటా యింపుతో సేకరణ వేగవంతమైంది. అయినా అకా ల వర్షాలు తూకం, లోడింగ్‌కు అడ్డంకిగా మారుతున్నాయి. రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కా ల్వలు తీసి, కవర్లు మార్చి శ్రమిస్తున్నారు.

జిల్లాలో 23.7 మి.మీ వర్ష పాతం..

జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 23.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమైదైంది. కాసిపేటలో 56.8 మిల్లి మీటర్లు, జన్నారంలో 13.5, దండేపల్లిలో 42.6, లక్సెట్టిపేటలో 28.4, హజీపూర్‌లో 47, తాండూర్‌లో 38.5, భీమినిలో 15.7, కన్నెపెల్లిలో 10, వేమనపల్లిలో 18.9, నెన్నెలలో 11.5, బెల్లంపల్లిలో 18.1, మందమర్రిలో 29.3, మంచిర్యాలలో 26.6, నస్పూర్‌లో 24.5, జైపూర్‌లో 13.3, భీమారంలో 8, చెన్నూర్‌లో 5.2, కోటపల్లిలో 19.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారులు చేపడుతున్న చర్యల గురించి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ శ్రీకళను ఫోన్‌లో సంప్రదించగా, ఆమె స్పందించలేదు.

● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్ర1
1/2

● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్ర

● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్ర2
2/2

● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement