
ఎంసీహెచ్‌లో సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలటౌన్: మాతా శిశు ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలకు సమస్యలు ఎదురుకాకుండా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు వైద్యులకు సూచించారు. ఎంసీహెచ్‌ను శనివారం సందర్శించి వైద్యులు, గర్భిణులతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్‌ఎంవోలు భీష్మ, శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ శివాజీ ఉన్నారు.
పనులు వేగవంతం చేయాలి
లక్సెట్టిపేట: పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సూచించారు. నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతంర ఐదు రోజులుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఆరీఫ్, నాయకులు శ్రీనివాస్, చింత అశోక్, నాగభూషణం, పింగిళి రమేశ్, స్వామి, సురేశ్ పాల్గొన్నారు.