
ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి కార్పొరేట్ జీఎం(ఐ అండ్ పీఎం) మధుసూదన్ శనివారం పర్యటించారు. జీఎం కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి ఉత్పత్తి ఉత్పాదకతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్య సాధనలో రక్షణ పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌ను ఏరియా జీఎం దేవేందర్‌తో పాటు అధికారులు శాలువాలు క ప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఏస్‌వోటు జీఎం విజయ్ ప్రసాద్, ఇంజనీర్ వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ తదితరులు ఉన్నారు.