కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలు

Published Sat, Apr 20 2024 1:25 AM

బోల్తాపడ్డ కారు - Sakshi

జైపూర్‌: మండల కేంద్ర సమీపంలోని నర్సీ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మంచిర్యాలకు చెందిన యోగేశ్వ ర్‌ చెన్నూర్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శుక్రవారం కారులో చెన్నూర్‌ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న క్రమంలో నర్సీ సమీపంలో అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి పల్టీకొట్టింది. దీంతో ఇందులో ఉన్న యోగేశ్వర్‌తోపాటు మరోవ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

రైలుకింద పడి మహిళ ఆత్మహత్య

మంచిర్యాలక్రైం: రైలుకింద పడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన కట్ట పారిజాతం(55) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్య బాగు కాలేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల, పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పారిజాతం భర్త పరిపూర్ణచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

చికిత్స పొందుతున్న

వ్యక్తి అదృశ్యం

మంచిర్యాలక్రైం: స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై లక్ష్మణ్‌ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్‌కు చెందిన తగరం చిరంజీవి అనారోగ్యం కారణంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 15న చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 17న తెల్ల వారుజామున బయటకు వెళ్లిపోయాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఆచూకీ లభించలేదు. చిరంజీవి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అసభ్యకర పోస్టుపై కేసు

రామకృష్ణాపూర్‌: సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి రాజేష్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరూ పోస్టులు చేయొద్దని, ఎన్నికల నేపథ్యంలో సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

చికిత్స పొందుతూ

యువకుడి మృతి

వాంకిడి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన బూరం శ్రీకాంత్‌(24) రెండేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితమే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్‌ ఈ నెల 13న పురుగుల మందు తాగాడు. ఏడురోజుల పాటు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. కాగా, ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సాగర్‌ తెలిపారు.

మృతిచెందిన పారిజాతం
1/3

మృతిచెందిన పారిజాతం

చిరంజీవి(ఫైల్‌)
2/3

చిరంజీవి(ఫైల్‌)

శ్రీకాంత్‌ (ఫైల్‌)
3/3

శ్రీకాంత్‌ (ఫైల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement