
జేసీబీతో మటన్ దుకాణం కూల్చివేత
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని ఎన్‌టీఆర్ చౌర స్తా వద్ద మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు మంగళవారం కొరడా ఝలిపించారు. మటన్ దుకాణాల్లో అనారోగ్యంగా ఉన్న మేకలు కోస్తున్నారని ఇప్పటికే పలుమార్లు చెప్పిన వినకపోవడంతో దుకాణాలను జేసీబీ వాహనంతో కూల్చివేశారు. ఇ ష్టారాజ్యంగా మటన్ అమ్మకాలు జరుపుతున్నారని, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కోసి ఉంచిన మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన, అనారోగ్యంగా ఉన్నవాటిని విక్రయిస్తున్నార ని దుకాణాలను సీజ్ చేశారు. ఆరోగ్యంగా ఉన్న వా టిని పశువైద్యాధికారులు ధ్రువీకరించిన అనంత రం విక్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అజీమ్, జవాన్ దినేష్ సిబ్బంది పాల్గొన్నారు.