కెజిబివిలో బదిలీలకు వేళాయే! | Transfers of KGBV teachers and non teaching staff starts from Saturday | Sakshi
Sakshi News home page

కెజిబివిలో బదిలీలకు వేళాయే!

May 5 2023 1:50 AM | Updated on May 5 2023 7:11 PM

- - Sakshi

మంచిర్యాలఅర్బన్‌/నిర్మల్‌రూరల్‌/ఆదిలాబాద్‌ టౌన్‌ : ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కస్తూరిబా బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు విద్యాశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇ చ్చింది.

కేజీబీవీలో విధులు నిర్వహించే స్పెషల్‌ ఆ ఫీసర్‌, పీజీ సీఆర్‌టీ, సీఆర్‌టీ, ఏఎన్‌ఎం, అకౌంటె ంట్‌, పీఈటీలకు షిఫ్టింగ్‌ అవకాశం కల్పించింది. ప్రస్తుతం పనిచేస్తున్న విద్యాలయాల్లో 01–05–23 నాటికి రెండు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసినవారు అర్హులుగా ప్రకటించింది. విల్లింగ్‌ (ఇష్టం)ఉన్న అభ్యర్థులు మాత్రమే బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన బుధవారం రాత్రి మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈనెల 6 నుంచి 9వరకు https://transfers.cdse.telangana.govt.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్లుగా బ దిలీల కోసం ఎదురుచూస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్‌ విడుదల..

కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 1వ తేదీ నాటికి కేజీబీవీలో రెండు సంవత్సరాల స ర్వీస్‌ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు. బ దిలీ కోరుకునే ఉద్యోగులు ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ప్రకారం వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ జరుగుతుంది. కలెక్టర్‌ చైర్మన్‌ గా, అడిషనల్‌ కలెక్టర్‌ మెంబర్‌గా, డీఈవో మెంబర్‌ సెక్రటరీగా ఉంటారు.

సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో పనిచేసిన కాలానికి సంవత్సరానికి మూడు పాయింట్ల చొప్పున పనితీరు ఆధారిత పాయింట్లు కేటాయిస్తారు. ప్రాధాన్యత కేటగిరీ కింద వికలాంగులు, వితంతువులు, న్యాయపరంగా విడాకులు పొందినవారు, వివిధ వ్యాధులతో బాధపడేవారు, వివిధ వ్యాధులతో బాధపడే పి ల్లలు గల సిబ్బంది, అవివాహితులు, మొదలైన కేటగిరీ ఉన్న వారిని ఉన్నవారికి మొదట ప్రాధాన్యత ఉంటుంది. ఖాళీలతోపాటు పరస్పరం అంగీకారం(ఇష్టపడే) జిల్లా, అంతర్‌ జిల్లా షిఫ్టింగ్‌(బదిలీ)కు అవకాశం కల్పించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా...

● మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీలు న్నాయి. ఇందులో స్పెషల్‌ ఆఫీసర్‌ పోస్టు ఒకటే ఖాళీగా ఉంది. పీజీ సీఆర్‌టీలు 63 మందిగాను 32 మంది విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌టీ, పీఈటీలు 145 మందికి 135, ఏఎన్‌ఎంలు 18 పోస్టులకు 18 మంది పనిచేస్తున్నారు.

● నిర్మల్‌ జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా అందులో టీచింగ్‌ విభాగంలో మొత్తం 222 పోస్టులు మంజూరుకాగా 187 మంది పనిచేస్తున్నారు. 35 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నాన్‌ టీచింగ్‌ విభాగంలో మొత్తం 252 పోస్టులు మంజూరు కాగా, 206 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 46 ఖాళీలు ఉన్నాయి.

● ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 17 కేజీబీవీలు ఉన్నాయి. టీచింగ్‌ పోస్టులు 230 మంజూరు కాగా, ప్రస్తుతం 175 మంది పనిచేస్తున్నారు. 55 ఖాళీలు ఉన్నాయి. నాన్‌ టీచింగ్‌ పోస్టులు 332 ఉండగా, 208 మంది పనిచేస్తున్నారు.

● కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 15 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో టీచింగ్‌ విభాగంలో 219 పోస్టులు ఉండగా 130 మంది పనిచేస్తున్నారు. 89 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాన్‌టీచింగ్‌ విభాగంలో 216 పోస్టులు ఉండగా 134 మంది పనిచేస్తున్నారు. 72 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మూడు విధాలుగా బదిలీలు..

బదిలీల ప్రక్రియ మొత్తం మూడు రకాలుగా జరుగుతుంది. ఉద్యోగుల పరస్పర బదిలీలు, జిల్లాల మధ్య పరస్పర బదిలీలు, జిల్లాలో బదిలీలు ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగి పరస్పర అంగీకారంతో బదిలీ అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం ఈసారి కల్పించింది. సాధారణ బదిలీలు మాత్రం కొత్త జిల్లాల ప్రకారం జరుగుతాయి. కానీ పరస్పర బదిలీలు కొత్త జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రకారం కూడా జరుగుతాయి.

స్పౌజ్‌ విభాగం కింద బదిలీ కోరుకునే వారికి స్పౌజ్‌ పని చేసే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి మాత్రమే ట్రాన్స్‌ఫచేస్తారు. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ద్వారా ఏర్పడిన కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ప్రాధాన్యత విభాగం సర్టిఫికెట్లు, పనితీరు ఆధారిత పాయింట్లు, పరస్పర బదిలీ అభ్యర్థన సర్టిఫికెట్లు మొదలైనవి ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాలి. అదేవిధంగా వీటి జిరాక్స్‌ పత్రాలను ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రాలతో జత చేయాల్సి ఉంటుంది.

ఇది షెడ్యూల్‌....

బదిలీల ప్రక్రియ మొదలు : 05–05–2023

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు : మే 6 నుంచి మే 9 వరకు

ఆన్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా కార్యాలయంలో సమర్పించే తేదీలు : మే 10, 11

దరఖాస్తుల పరిశీలన, ఆమోదం : మే 12 నుంచి 15 వరకు

పాయింట్లతో కూడిన జాబితా విడుదల : మే 16

అభ్యంతరాలు సమర్పించు తేదీలు : మే 17, 18

అభ్యంతరాల పరిశీలన తేదీలు : 18, 19

తుది జాబితా విడుదల : మే 20

వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు తేదీలు : మే 21, 22

వెబ్‌ ఆప్షన్స్‌ పరిశీలన, ఆమోదం తేదీలు : మే 23, 24

వెబ్‌ అలాట్‌మెంట్‌ బై టీఎస్‌ ఆన్‌లైన్‌ : మే 25, 26

బదిలీల ఉత్తర్వులు, జాయినింగ్‌ : మే 27 నుంచి 29 వరకు

సద్వినియోగం చేసుకోవాలి

కేజీబీవీలో పనిచేసే ఉపాధ్యాయ సిబ్బందికి బదిలీల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగిస్తాం. సుమారు 25 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

– రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్‌

కేజీబీవీల్లో షిఫ్టింగ్‌కు ఉత్తర్వులు

జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, సిబ్బందికి షిఫ్టింగ్‌ పద్ధతిలో బదిలీల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 6నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రెండేళ్ల సర్వీస్‌ పూర్తయినవారికే అవకాశం ఉంది. వీటికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చడం జరిగింది.

– ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

సద్వినియోగం చేసుకోవాలి

కేజీబీవీలో పనిచేసే ఉపాధ్యాయ సిబ్బందికి బదిలీల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగిస్తాం. సుమారు 25 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

– రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్‌

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement