గత 20 ఏళ్ల కిందట గుండెపోటు చాలా తక్కువగా వచ్చేది. ఇందులో కూడా 50 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఉండేది. కానీ, ప్రస్తుతం మారిన జీవన శైలి వల్ల 20 ఏళ్ల యువకుల దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకులే అధికంగా ఉంటున్నారు. దీనికి ప్రధానంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్ రావడం, బీపీ, పాస్ట్‌ఫుడ్, బరువు, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటివి గుండెపోటుకు దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100 మంది రోగులలో 70 శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు.
– మహేష్‌బాబు, కార్డియాలజిస్ట్


