బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

బీచుపల్లి ఆలయంలో

డీఎస్పీ పూజలు

రమణీయం.. అంజన్న రథోత్సవం

కనులపండువగా స్వామివారి రథోత్సవం

ఎర్రవల్లి: ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే ఆంజనేయస్వామి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు బీచుపల్లి పుణ్యక్షేత్రమంతా అంజన్న నామస్మరణతో మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు అభయాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజను చేశారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రథాంగ హోమం, రాత్రికి బోయ పూజారులు కుంభం పూజలను వైభవంగా నిర్వహించారు. వేలసంఖ్యలో భక్తుల నడుమ రాత్రి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, గద్వాల, కర్నూల్‌, అలంపూర్‌, కొత్తకోట, కొల్లాపూర్‌, ఆత్మకూర్‌, రాయచూర్‌ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో మట్టికుండల్లో దాసంగాలతో ప్రత్యేక నైవేద్యాలను వండి అభయాంజనేయ స్వామికి ప్రసాదంగా సమర్పించారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు లు తీర్చుకున్నా రు. జాతర సందర్భంగా చిన్నా రుల కోలాటం, భజనల నడుమ ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్‌కుమార్‌, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

ప్రత్యేక బోనం తెస్తున్న బోయ పూజారులు, స్వామిని దర్శించుకుంటున్న డీఎస్పీ మొగిలయ్య

మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ

ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

మట్టికుండల దాసంగాలతో

స్వామివారికి ప్రత్యేక నైవేద్యం

బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం డీఎస్పీ మొగిలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈవో పురేందర్‌కుమార్‌ శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతీచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను వివరించారు. డీఎస్పీ వెంట సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐ రవిరాథోడ్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement