మన్ననూర్: మన్ననూర్‌లో ని ఉమామహేశ్వర కాలనీకి చెందిన రామావత్ డా కు నాయక్ పెద్ద కుమారు డు జశ్వంత్ నాయక్(17) వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమామహేశ్వర కాలనీకి చెందిన జశ్వంత్ నాయక్ అచ్చంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో గ త విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ చ దువుతుండగా..ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు ఇష్టపడటంతోపా టు పెళ్లి చేసుకునేంత వరకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు రామా వత్ వంశీయులమైన మన కుటుంబానికి ఆ అమ్మాయి వరుసకాదు మర్చిపొమ్మని సర్ధి చెప్పారు. మనస్తాపానికి గురైన యువకుడు గురువారం ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అక్క, తమ్ముడు ఉన్నారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
రాజోళి: ఇటీవల బీచుపల్లి వద్ద చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గాయపడి కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందా రు. అయితే మరో సోదరు డు చంద్రమోహన్‌రెడ్డి (52)కి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం మృతి చెందాడు. ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ఇద్దరు చనిపోగా.. మిగిలిన ఒక్కరైన ప్రాణాలతో ఉంటారని ఆశించినప్పటికీ తమకు నిరాశే మిగిలిందని కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధించారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
కొత్తపల్లి: మండలంలో రేషన్ మాఫియా జోరుగా కొనసాగుతున్నది. పేదలకు మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంతో అక్రమార్కులు రేషన్‌షాపుల ముందే లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తూ పేదవాడి ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. రేషన్ బియ్యం ప్రభుత్వం మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో దళారులకు కాసుల పంట కొనసాగుతుంది. మండంలో అధికారులు దాడులు జరిపినా.. ఏదో ఒక మూలన పక్కదారి పడుతుంది. మండలంలో బియ్యం వ్యాపారం జోరుగా కొనసాగుతుందనే నమ్మదగిన సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించగా.. గురువారం అర్ధరాత్రి కొత్తపల్లి నుంచి బొలేరోలో 40బ్యాగులు 18క్వింటాళ్ల 60కేజీలు ప్లాస్టిక్ బ్యాగుల్లో పీడీఎస్ బియ్యం తరలించే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పీడీఎస్ తరలించే బొలేరో డ్రైవర్‌ను విచారించగా.. కొత్తపల్లికి చెందిన బియ్యం వ్యాపారి సురేష్‌గౌడ్‌పై 6–ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ కాలప్ప తెలిపారు. పట్టుబడిన బియ్యం మున్సిపల్ పట్టణంలోని రేషన్‌షాపునకు అప్పగించినట్లు తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యం స్థానిక డీలర్ల కనుసైగల్లో అక్రమ వ్యాపారం కొనసాగుతునట్లు స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు అక్రమ బియ్యం వ్యాపారులపై గట్టి చర్యలు తీసుకోవాలని మండల వాసులు అనుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కాలప్పను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా పేదలకు అందాల్సిన బియ్యం అమ్మిన, కొనుగోలు చేసినవారిపై బియ్యం తరలించే వాహనాలపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
‘ఎక్స్‌టెన్షన్లు వద్దు
ప్రమోషన్లు కావాలి’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తాజాగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సీఈగా రిటైర్డ్ అయిన సత్యనారాయణరెడ్డికి 6 నెలల పాటు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం దుర్మార్గమని టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎక్స్‌టెన్షన్‌లో భాగంగా ఆయనకు రెండు పదవులు మహబూబ్‌నగర్, హైదరాబాద్ సీఈగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల పదోన్నతులలో నలుగురు ఇంజినీర్లు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్‌టెన్షన్లు మొదటగా ఇచ్చిన గడువు పూర్తి కావడంతోనే మరికొంత సమయాన్ని కూడా అలాగే చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో నాగర్‌కర్నూల్‌లో రిటైర్డ్ అయిన ఒక్క ఎస్‌ఈకి రెండు పోస్టులు ఎక్స్‌టెన్షన్ ఇచ్చారని విమర్శించారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఎక్స్‌టెన్షన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఇంజినీర్లను కావాలంటే అడ్వైజర్‌గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీర్ల సమావేశంలో తెలియజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వ ధోరణిని మార్చుకోవాలని కోరారు.


