సిద్దమైన వర్మీకంపోస్టు ఎరువు
జనుము సాగు
పాడి–పంట
అలంపూర్: వ్యవసాయం పూర్వం సేంద్రియ ఎరువుల ద్వారానే జరిగేది. పూర్వికులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించకుండానే సేంద్రియ ఎరువులపై ఆధారపడేవారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతోపాటుగా రసాయనాల వినియోగించుకోవాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడుతూ.. దిగుబడులు పెంచుకోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సేంద్రియం ద్వారా పంటల సాగు ఎంతో నయంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ సూచిస్తున్నారు. వీటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.
రసాయనాల వాడకంతో..!
సాగులో బస్తాల కొద్ది రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకోనే స్థాయి పంటలను ఆశించే పురుగుకు పెరుగుతుంది.
రసాయన ఎరువులు, పురుగుల మందులు అన్నీ పంటకు అధికంగా వాడకంతో వాటిని తట్టుకోనే స్థాయి పురుగులు, తేగుళ్లు కాలక్రమేన అధికమైపోతాయి. వీటి వినియోగం అధికంగా ఉంటే సాగు ఖర్చు విపరితంగా పెరుగుతుంది.
ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.
సరైన అవగాహన లేకుండా రసాయనాల వాడకం వల్ల వాటి అవశేషాలు నీటిలో, సాగు నేలలో కలిసి కలుషితమవుతాయి.
నష్టాలు–సూచనలు :
మితిమీరిన రసాయనాల వాడకంతో మిత్ర కీటకాలు నశించి పర్యావరణంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి.
వ్యవసాయంలో పురుగుల మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్‌లో పోటీకి మన ప్రాంత రైతులు నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
పంట ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించేలా సాగు చేసుకోవాలి.
సేంద్రియ విధానం:
సాగులో లింగాకర్షక బుట్టలు వాడాలి.
పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి.
గంధకం, రాగి ఉత్పత్తులు వాడవచ్చు. వృక్ష సంబంధం నూనెల్ని కొన్ని జాగ్రత్తలతో వాడాలి.
వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీకంపోస్టు ఎరువులను వాడాలి.
పంట వ్యర్థాలు, కొబ్బరి వ్యర్థాలు, షజొల్లా ఉపయోగపడేవే.
పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు.
సేంద్రియ ఎరువులతోనే సాధ్యం
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయ చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు.
సేంద్రియ ఎరువులైన వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు, కోళ్ల ఎరువు, పచ్చి ఆకులు, పిండి చెక్కలు వాడాలి.
నాణ్యమైన రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయ శాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండే వర్మీ కంపోస్టు బెడ్స్‌నూ రూ.5వేల సబ్సీడిపై రైతులు పొందవచ్చు.
వ్యవసాయ శాఖ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలను రూ.5శాతం సబ్సీడీపై అందిస్తున్నారు.
సేంద్రియ ఉత్పత్తులు
అంతర్జాతీయ మార్కెట్‌లోకి...!
అంతర్జాతీయ మార్కెట్‌లో సేంద్రియ ఎరువులు నిలవాలంటే నిబంధనలు పాటించాల్సిందే.
మన ప్రాంతంలోని నేలల్లో సేంద్రియ కర్భణం చాలావరకు తగ్గిపోయి దిగుబడుల్లో రైతులు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అనేక చోట్ల ఒకశాతం కార్బనం ఉన్నట్లు తెలుస్తోంది.
సేంద్రియ కర్బనం పెంచడానికి కృషి చేయాలి.
సేంద్రియ సాగు ద్వారా ఆహార ఉత్పత్తులు సాధించాలంటే ప్రపంచ దేశాలతోపాటు మన ప్రాంతంలో కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల కమతాల్ని పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి కొన్ని ప్రమాణాలను ప్రభుత్వం నిర్ధేశించడం జరిగింది. ఆ జాబితాలు సిద్ధమవుతున్నాయి.
ఏదైనా ఆహార ధాన్యాలు సేంద్రియ ఉత్పత్తిగా గుర్తించాలంటే సాగులో అనేక ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
సేంద్రియ వ్యవసాయ ఉద్యమాల అతర్జాతీయ సమాఖ్య కొన్ని సాగు ప్రమాణాలను సూచించింది.


