రాజాపూర్(బాలానగర్): కోళ్లలోడ్‌తో ముందు వెళ్తున్న డీసీఎంను వెనక నుంచి ఓ కంటైనర్ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలైన హెల్పర్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున బాలానగర్ మండల శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా.. వరంగల్ టౌన్‌కు చెందిన డీసీఎం డ్రైవర్ మహేశ్, హన్మకొండకు చెందిన అరవింద్(24) హెల్పర్ స్నేహ కోళ్లఫాంలో పనిచేస్తూ శనివారం అనంతపురంలో కోళ్లఫాంలో కోళ్లను లోడ్ చేసుకుని హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆదివారం వీరు వెళ్తున్న ఢీసీఎంను వెనక నుంచి ఓ కంటేనర్ ఢీకొనడంతో డ్రైవర్ మహేశ్ గాయాలు కాగా.. హెల్పర్ అరవింద్ తీవ్ర గాయాలతో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు గమనించిన స్థానికులు అరవింద్‌ను క్యాబిన్లో నుంచి బయటికి తీసి షాద్‌నగర్‌లోని బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతిచెందినట్లు బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ తెలిపారు. డీసీఎం డ్రైవర్ మహేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రైలు కిందపడి
వ్యక్తి బలవన్మరణం
గద్వాల క్రైం: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని నదిగ్రహారం కాలనీకి చెందిన తెలుగు మునిస్వామి (48) మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపం చెంది ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలోని పిల్లిగుండ్ల కాలనీ శివారులో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
కోడేరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ని వాసముంటున్న ఎరుకలి వెంకటయ్య(40) తన ఇంటి వద్ద ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నీళ్లు పట్టేందుకు మోటార్ స్విచ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతు డికి భార్య బాలీశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
మక్తల్: ఉరివేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మండలం బోందల్‌కుంటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామా నికి చెందిన దాసరి లావణ్య (32)కూలీ చేసుకొని జీవనం గడుపుతుండేది. ఎప్పటిలాగానే కూలీ పని ముగించుకొని సాయంత్రం శనివారం ఇంటికి చేరుకుంది. ఆదివారం లావణ్య ఇంకా ఇంటి తలుపులు తెరువకపోవడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని తలుపులను విరగొట్టారు. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు పిల్లలున్నారు. మృత్యురాలి తల్లి దాసరి రేవతమ్మ ఫిర్యాదు మేర కు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.
ఉరేసుకొని యువకుడి బలవన్మరణం
వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల తూర్పుతండాకు చెందిన నానావత్ యాదగిరి (సిద్ధార్థ్) హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుతండాకు చెందిన నేనావత్ గోపాల్‌నాయక్, మణెమ్మ దంపతులు కుమారుడు యాదగిరి (25)తో కలిసి హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదగిరి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్లగా యాదగిరి ఉరేసుకున్నట్లు గుర్తించారు. కిందకు దింపి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పెళ్లి ముహూర్తాన్ని
అడ్డుకున్న అధికారులు
లింగాల: మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం చేసేందుకు ముహూర్తం పెట్టుకుంటున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందడంతో అధికారులు వచ్చి ముహూర్తాన్ని అడ్డుకున్నారు. నాగర్‌కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు యశ్వంత్, ప్రమీల గ్రామానికి చేరుకొని 18 ఏళ్లు నిండని బాలికకు పెళ్లి ముహూర్తం పెట్టడాన్ని చూశారు. అధికారులు పూజారి, తల్లిదండ్రులను హెచ్చరించారు. మైనర్లకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని, 2006 బాల్య వివాహాల నిషేధ చట్ట ప్రకారం రెండేళ్ల శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బాలికతోపాటు కుటుంబ సభ్యులతో అంగీకార పత్రం తీసుకోవడంతో ముహూర్తానికి అడ్డుకట్ట పడింది.


