రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం

Mar 23 2026 9:02 AM | Updated on Mar 23 2026 9:02 AM

24 నుంచి 29వ తేదీ వరకు

ఉత్సవాలు

27న సీతారాముల కల్యాణోత్సవం

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 24 నుంచి 29వ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు ఆదివారం తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 24న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, అంకురార్పణ, 25న ధ్వజారోహణం, శ్రీలక్ష్మీహయగ్రీవ హోమం, 26న శ్రీ ధన్వంతరీహోమం, శ్రీసుదర్శన హోమం, 27న సీతారాముల కల్యాణోత్సవం, రథోత్సవం, 28న శ్రీ రాముడి సామ్రాజ్య పట్టాభిషేకం, ఐశ్వర్యప్రాప్తి, మహాలక్ష్మీ హోమం, 29న చక్రస్నానం, మహా పూర్ణాహుతి, పుష్పయాగం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు హాజరై ఉత్సవాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement