మానవపాడు: మండల కేంద్రంలో బింగిదొడ్డి గ్రామానికి చెందిన సునీల్‌రెడ్డి పత్తి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు దట్టంగా వ్యాప్తి చెందడంతో దాదాపు 6 ఎకరాల్లో 18 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. దీంతో బాధిత రైతుల లబోదిబోమని వేడుకుంటున్నాడు. కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తుండగా పంట మొత్తం కాలి బూడిదైందని, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
విద్యార్థి బలవన్మరణం
తెలకపల్లి: మండల కేంద్రానికి చెందిన డీఎంఎల్‌టీ విద్యార్థి సామ శివ (22) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ నరేశ్ వివరాల మేరకు.. మృతుడు సామ శివ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డీఎంఎల్‌టీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన అతడు.. తన మనసు బాగోలేదని ముభావంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి రాంచంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.


