పాన్‌గల్: స్వైన్‌ప్లూ వ్యాధితో వారం రో జుల పాటు ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలు డు గురువారం మృతి చెందాడు. పాన్‌గల్ మండలం నిజామాబాద్ (మంగళ్లపల్లి) గ్రామానికి చెందిన పసుపుల వరలక్ష్మి, మద్దిలేటిల కుమారుడు రిషికేష్(5) అరుదైన స్వైన్‌ప్లూతో బాధపడుతూ హైదరాబాదులోని రెయిన్‌బో ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు అప్పులు చేసి రూ.10లక్షలు ఖర్చుచేసి చికిత్స అందించిన ప్రాణం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్, మాజీఎంపీపీ వెంకటేష్‌నాయుడు, మాజీ విండో డైరెక్టర్ ఉస్మాన్ గ్రామానికి చేరుకొని బాలుడి మృతదేహనికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మరాఠిలక్ష్మి, మాజీసర్పంచ్ అంజి, వెంకట్, జూపల్లి యువసేన నాయకులు పాల్గొన్నారు.


