గ్రామాల్లో రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుపోయాయి. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికగా మారుతాయి. – స్వర్ణలత,
సర్పంచ్, కోడూరు, మహబూబ్‌నగర్ రూరల్ మండలం
ప్రతి పక్ష సర్పంచ్‌లపై వివక్ష
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష సర్పంచ్‌లపై వివక్ష చూపుతున్నారు. ఇటీవల విడుదలైన ఈజీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ సర్పంచ్‌లకు మాత్రమే ఇచ్చారు. దీనిపై ఎక్కడ ప్రశ్నించాలో తెలియడం లేదు. మండల సమావేశాలు జరిగితే అక్కడ ఉన్న అధికారులకు తమ గోడును వినిపిస్తాం.
– నవనీత, సర్పంచ్, వెన్నచేడ్, గండేడ్ మండలం
అవగాహన పెరుగుతుంది..
మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన పెరుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. – వెంకటయ్య,
సర్పంచ్, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ రూరల్


