మహబూబ్‌నగర్ పరిధిలో నిర్మించే మూడు ఎస్టీపీల్లో రెండు చోట్ల భూసేకరణలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడో దాని పనులు నడుస్తున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే కేవలం తొమ్మిది నెలల్లో ప్లాంట్ల నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంది.
– విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ, మహబూబ్‌నగర్
నిర్దేశిత గడువులోగా
పూర్తి చేయాలి..
మహబూబ్‌నగర్ కార్పొ రేషన్ పరిధిలో మంజూరైన మూడు ఎస్టీపీల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. నిధులు మంజూరై రెండేళ్లు దాటినా ఇంకా పనులు ప్రారంభించకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం. చిత్తశుద్ధి, ప్రణాళిక కొరవడడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రధాన అడ్డంకి అయిన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపి.. గడువులోపు అన్ని పనులు చేసేలా చూడాలి. – పగడం మల్లేష్,
పద్మావతి కాలనీ, మహబూబ్‌నగర్
●


