పాలమూరులో సీఎం కప్
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం
● నేటి నుంచి 22 వరకు
రాష్ట్రస్థాయి బాక్సింగ్,
23 వరకు నెట్‌బాల్ పోటీలు
● హాజరుకానున్న 33 జిల్లాల
క్రీడాకారులు
● ఏర్పాట్లు చేసిన జిల్లా యువజన, క్రీడాశాఖ
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు జిల్లాకు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటు క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడంలో అటు క్రీడా పోటీలను నిర్వహించడంలో పేరుంది. ము ఖ్యంగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు జిల్లాకేంద్రం వేదికగా నిలుస్తోంది. దీంతో రాష్ట్రస్థాయి టోర్నీల కేటాయింపులో జిల్లాకు తగిన ప్రాధాన్యత లభిస్తోంది.
సీఎం కప్ రాష్ట్రస్థాయి టోర్నీలు
ఈ ఏడాది సీఎం కప్ క్రీడాపోటీలను నిర్వహిస్తున్నా రు.జిల్లాలో ఇప్పటికే గ్రామ పంచాయతీ క్లస్టర్, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో పోటీలు ముగిశాయి. ఇప్పుడు జిల్లాలో రెండు రాష్ట్రస్థాయి సీ ఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. గతేడాది సీఎం కప్‌లో భాగంగా నెట్‌బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి క్రీడాటోర్నీలను కేటాయించారు. ఈ ఏడాది కూడా రెండు రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలు నిర్వహించనున్నారు.
బాక్సింగ్, నెట్‌బాల్ టోర్నీలు
జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నెట్‌బాల్, బాక్సింగ్ బాల, బాలికల సీఎం కప్ రాష్ట్రస్థాయి పో టీలను నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి 22 వ తేదీ వరకు బాక్సింగ్ పోటీలు, 23వ తేదీ వరకు నెట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నా రు. బాక్సింగ్ పోటీలకు ఆయా జిల్లాల నుంచి 300 కిపైగా క్రీడాకారులు రానున్నా రు. బాల, బాలికలకు వేర్వేరుగా 8 వెయిట్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్ రింగ్ ఏర్పా టు చేశారు. చాలా ఏళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. అదే విధంగా నె ట్‌బాల్ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాజట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీకి దాదాపు బాల, బాలికలు 800 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియ ల్స్ హాజరుకాన్నారు. రాష్ట్రస్థాయి సీఎంకప్ బాక్సింగ్, నెట్‌బా ల్ పోటీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి
మక్తల్: పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నుంచి జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ ఏర్పాట్లను గురువారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 23 జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి 66
జట్లు పాల్గొంటాయని తెలిపారు. సీఎం కప్ నిర్మాణంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 1500 మంది క్రీడాకారులు కోచ్, సహయ సిబ్బంది, పీఈటీ, ప్రము ఖులు పాల్గొంటారన్నారు. స్టేడియంలో కోర్టులు, మ్యా ట్లు, క్రీడాకారులకు టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీరాము లు, తహసీల్దార్ సతీష్‌కుమార్, డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, పీఈటిలు భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి నెట్‌బాల్, కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. గతేడాది రెండు రాష్ట్రస్థాయి టోర్నీలను నిర్వహించాం. ఈ రెండు రాష్ట్రస్థాయి టోర్నీలకు వచ్చే 33 జిల్లాల నుంచి క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. నెట్‌బాల్ పోటీలను మెయిన్ స్టేడియంలో, బాక్సింగ్ పోటీలను ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తాం. సాయంత్రం 3 గంటలకు జరిగే ఈ టోర్నీల ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్నారు.
– శ్రీనివాస్, డీవైఎస్‌ఓ,
మహబూబ్‌నగర్
పాలమూరులో సీఎం కప్


