పాము కాటుతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో రైతు మృతి

Feb 20 2026 7:16 AM | Updated on Feb 20 2026 7:16 AM

పాము

పాము కాటుతో రైతు మృతి

బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌ గ్రామానికి చెందిన రైతు నాగన్న (38) పాము కాటుతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగన్న బుధవారం పొలం పనులు చేస్తుండగా రక్త పింజర పాము కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు నాగన్నను చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగన్న గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.

దాడి కేసులో

ముగ్గురు రిమాండ్‌

ఎర్రవల్లి:ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన దా డి కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు కోదండాపురం ఎస్‌ ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండల పరి ధిలోని షేకుపల్లికి చెందిన బండి కృష్ణుడు, అత ని కుమారులు బండి శ్రీకర్‌, బండి భాస్కర్‌, వారి ముగ్గురి భార్యలు మొత్తం ఆరుగురు కలిసి అతని సోదరుడు బండి రాముడు (66), అతని కుటుంబ సభ్యులపై ఈ నెల 11న కర్రలతో దాడి చేశారు. దాడిలో బండి రాముడుకు రక్తగాయాలు కాగా చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందాడు. అదే ఘ టనలో మృతుని కుమారుడు హరిబాబు, కోడ లు పావనికి కూడా గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ప్రదీప్‌కుమార్‌ నేతృత్వంలో విచారణ అనంతరం నిందితులు బండి కృష్ణు డు, బండి శ్రీకర్‌, బండి భాస్కర్‌ను గురువా రం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఇసుక టిప్పర్‌ పట్టివేత

చిన్నచింతకుంట: దేవరకద్ర మండలంలోని రాకొండ గ్రామ ఊక చెట్టువాగు నుంచి బుధవారం అర్ధరాత్రి అక్రమార్కులు భారత్‌ బెంజ్‌ వాహనంలో మరికల్‌ మండలానికి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా చిన్నచింతకుంట మండలం బండ్రప ల్లి సమీపంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గురువారం వాహ నం యాజమాని దారమోని శ్రీనివాసులు, డ్రైవర్‌ దేశాయి నవీన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

నవాబుపేట: శ్రీశైలం దర్శనానికి బైక్‌పై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న రాత్రి ఇద్దరు యువకులు శ్రీశైలం వెళ్తుండగా.. అచ్చంపేట సమీపంలో ఘాట్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌ (21) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కేశవులు (19) తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అతడు గురువారం మృతి చెందాడు. కాగా మృతుడిది మండలంలోని గురుకుంట కావడంతో మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.

విద్యుదాఘాతంతో

గొర్రెల కాపరి మృతి

బంట్వారం: విద్యుత్‌ షాక్‌కు గురై గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన బంట్వారం శివా రులో గురువారం వెలుగుచూసింది. ఎస్‌ఐ విమల కథ నం ప్రకారం.. నారాయణపే ట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(21) వృత్తిరీత్యా గొర్రెల కాపరి. ఈ నెల 17వ తేదీన రాత్రి ఓ రైతు పొలంలో గొర్రెల మంద వేశాడు. దాహం తీర్చుకునేందుకు సమీ ప పొలంలోని దొడ్లగడ్డ రాములు బోరు బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై గురువారం శ్రీకాంత్‌ తండ్రి కిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పాము కాటుతో రైతు మృతి 
1
1/1

పాము కాటుతో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement