డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా

Feb 20 2026 7:16 AM | Updated on Feb 20 2026 7:16 AM

డ్రైవ

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా

9 మందికి తీవ్ర, 10 మందికి

స్వల్ప గాయాలు

బస్సులో 19 మంది ప్యాసింజర్లు,

ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 21 మంది

ఘటన స్థలాన్ని పరిశీలించిన

సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐ

అనంతపురం డిపో బస్సుగా గుర్తింపు

ఉండవెల్లి: మండలంలోని ఇటిక్యాలపాడు శివారు లో గల జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి అనంతపురం జిల్లా కేంద్రానికి బస్సు బయలుదేరింది. బస్సు ఇటిక్యాలపాడు శివారుకు చేరుకొనే సమయానికి డ్రైవర్‌ నిద్రమత్తులో కునుకు తీయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. బస్సు లో ఉన్న 19 మంది ప్రయాణికులు, తోటి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. వీరి లో 9 మందికి తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రుల ను 108 అంబులెన్స్‌లో కర్నూల్‌ ఆ స్పత్రికి తరలించారు. వీరిలో స్నేహలత అనే యువ తి చేతి మణికట్టు పూర్తిగా తెగి కిందపడింది. దీంతో అరచేతిని తీసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని అలంపూర్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు, అనంతపురం డిపో మేనేజర్‌ మురళీధర్‌ పరిశీలించారు. బాధితుల వ స్తువులను వారి టికెట్‌,ఫొటో ఆధారంగా అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూసు కుంటామని తెలిపారు. స్వల్పంగా గాయపడిన కొందరు ప్రయాణికులు మరో వాహనంలో తమ స్వస్థలాలకు వెళ్లారు. ప్రయాణికుడు రంగన్న ఫిర్యా దు మేరకు బస్సు డ్రైవర్‌ జయరాములుపై కేసు న మోదు చే సి దర్యా ప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా 1
1/1

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement