వేపపిండి లాభాలు
అలంపూర్: వేప ఉత్పత్తులను పంటల సస్యరక్షణలో సమగ్ర పోషక యాజమాన్యంలో ఉపయోగిస్తారు. కీటకాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అజాడిరక్తిన్ అనే పదార్థం వేపగింజ లో ఎక్కువగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ పేర్కొన్నారు.దీనిలో వేప గింజల నుంచి వేప పిండిని తయారు చేసి పంటలకు ఉపయోగించవచ్చని సూచించారు. వేపపిండిలో ఉండే లక్షణాలు, ఉపయోగాలను రైతులకు వివరించారు.
వేప పిండిలో పోషకాలు:
100 కిలోల వేపపిండిలో 3.56 కిలోల నత్రజని, 0. 83 కిలోల భాస్వరం, 1.67 కిలోల పొటాషియం ఉంటుంది. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం కూ డా ఉంటాయి. ఐదు కిలోల వేప పిండిని 200 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టి దాని ని పలుచటి గుడ్డ తో వడగట్టి వచ్చిన ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేస్తే అనేక లాభాలు ఉన్నాయి.
ఆహార ధాన్యాల్లో :
● వరి పంటలో వేప పిండి ని యూరియాతో 5:1 నిష్పత్తిలో చల్లితే చీడపీడలు ఆ శించవు.30 శాతం నత్రజని ఆదా అవుతుంది. మొ క్కలు నత్రజని తీసుకొనే శక్తిని పెంచవచ్చు. ఎకరానికి 80 కిలోల వేపపిండిని వాడితే కాయతొలుచు పురుగు, ఉల్లికొరుకుడును నివారించవచ్చు.
● కంది, పెసర, మినుము, ఆముదం పంటల్లో ఎకరానికి 80 కిలోల వేపపిండి వాడటం వలన పురుగు ల బెడద తగ్గించవచ్చు. 5 శాతం వేప కషాయం పిచి కారీ చేయడం వలన రెక్కల పురుగు గుడ్లు పొదగదు.
● వేరుశనగలో ఎకరానికి 100 కిలోల వేపపిండి వాడటం వలన వేరుపురుగు, వేరుకుళ్లు, కాయకుళ్లు తెగులు నివారించవచ్చు.
కూరగాయ పంటల్లో :
టమాటాలో ఎకరానికి 200 కిలోల వేపపిండి వేయ డం వలన పూత రాలడం, కాయతొలుచు పురుగులను తగ్గించవచ్చు. టమాటాను ఆశించే పాము పొడ పురుగును వేపపిండితో తయారు చేసిన 50 శాతం ద్రావణాన్ని మొక్కలు నాటిన 10 నుంచి 15 రోజుల్లో పిచికారీ చేయడం వలన నివారించవచ్చు.
● కాలీఫ్లవర్‌లో ఎకరానికి 100 కిలోలు వాడటం వలన కుళ్లు తెగులు రాకుండా నివారించవచ్చు.
వాణిజ్య పంటల్లో:
పత్తిలో ఎకరానికి 50 కిలోల వేపపిండి వాడటం వలన వేరుకుళ్లు వ్యాధిని పూర్తిగా ఆరికట్టవచ్చు. యూరియాలోని నత్రజనిని ఎక్కువ కాలం అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో నత్రజనిని వినియోగించుకుంటాయి.
పండ్ల తోటల్లో : మామిడి, బత్తాయి తోటల్లో 3 కిలోల వేపపిండిని ఏడాది వయస్సు ఉన్న మొక్కలకు వాడాలి. దీని వలన కాండం తొలుచు, వేరు తొలుచు పురుగును నివారించవచ్చు. పూత, పిందె సమయంలో 5 శాతం వేప ద్రావణం పిచికారీ చేసి చీడ పీడల నుంచి కాపాడుకోవచ్చు.
పూల తోటల్లో : పూల తోటలైన కనకాంబరం, లిల్లీ, మల్లె తోటల్లో వేపపిండిని వాడటం వలన నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
వేపచెక్క
వేపపొడి
పాడి–పంట
వేపపిండి లాభాలు
వేపపిండి లాభాలు


