వాలీబాల్ చాంపియన్ మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ క్రీడలు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం ముగిసిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా యూత్ వాలీబాల్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాలికల జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఈ పోటీల్లో మహబూబ్‌నగర్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో 25– 15, 25– 17, 13– 25, 25– 22 సెట్లలో 3– 1 తేడాతో వరంగల్ జట్టుపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. బాలికల జట్టు విజేతగా నిలవడంపై జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ హనీఫ్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నవీరయ్యతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
చెస్ జట్టు సభ్యులను అభినందిస్తున్న రిజిస్ట్రార్ రమేష్‌బాబు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సౌత్‌జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ మహిళా జట్టు గురువారం బయలుదేరింది. ఈ మేరకు జట్టు సభ్యులకు రిజిస్ట్రార్ రమేష్‌బాబు ట్రాక్‌సూట్‌లు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సోమవారం వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గీతం యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి చెస్ పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభకనబర్చి గోల్డ్‌మెడల్ సాధించాలని, జాతీయ స్థాయిలో ప్రతిభకనబర్చితే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పీడీ శ్రీనివాసులు, చెస్ కోచ్ రాకేష్ పాల్గొన్నారు.
రాజ్యాధికారంతోనే బీసీల జీవితాల్లో మార్పు
వాలీబాల్ చాంపియన్ మహబూబ్‌నగర్


