స్ఫూర్తినింపిన విజయం
● వరల్డ్‌కప్ గెలుపుతో
మహిళా క్రికెట్‌కు ప్రాచుర్యం
● శిక్షణ పొందుతున్న
బాలికా క్రికెటర్ల హర్షం
● భారత మహిళా జట్టుపై ప్రశంసలు
మహబూబ్‌నగర్ క్రీడలు: నిరంతరం ప్రాక్టీస్, సమష్టి ప్రతిభ, పట్టుదలతో ఆడిన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను సొంతం చేసుకొంది. ప్రపంచకప్ గెలుపుతో దశాబ్దాల కలను సాకారం చేసి దేశంలో మహిళా క్రికెట్‌కు నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడిప్పుడే జిల్లాల్లో కూడా క్రికెట్‌పై మహిళలు, బాలికలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే వనపర్తి పట్టణంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో ప్రత్యేకంగా బాలికల క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన అకాడమీలో దాదాపు 45మంది బాలికలు క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 30మంది బాలికలు జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో ఆడారు. మరో ఆరుగురు బాలికలు హెచ్‌సీఏ పోటీల్లో పాల్గొని ప్రతిభచాటారు. భారత మహిళా జట్టు ప్రపంచకప్ గెలవడంపై అకాడమీలోని పలువురు బాలికలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్ఫూర్తినింపిన విజయం


