ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ రగ్బీ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 ఉమ్మడి జిల్లా బాలబాలికల రగ్బీ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ ఎంపికల్లో దాదాపు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, జగన్‌మోహన్‌గౌడ్, పరశురాముడు, కృష్ణ, రిటైర్డ్ పీడీ నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


